Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన ముందుగా జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా వచ్చి అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా ఒక స్కిట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే హైపర్ ఆది పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈయన హీరోయిన్ తో కలిసి పెళ్లి పీటలేకపోతున్నారంటే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అయితే నిజంగానే హైపర్ ఆది హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన ఢీ షోలో సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ తో కలిసి పెళ్లికి సిద్ధమైనట్లు నటించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
ఏడడుగులు నడిచిన ఆది….
బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమాలోని హీరోయిన్ హ్రితికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. సౌండ్ పార్టీ సినిమా ప్రమోషన్లలో భాగంగా సన్నీ హ్రితిక ఇద్దరు కూడా ఈ షోలో సందడి చేశారు. ఆది ఆమెను చూడగానే ఆది .. పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడమే కాకుండా తనతో కలిసి వేదికపైనే ఏడడుగులు నడిచారు. అయితే ఇదంతా చూసినటువంటి అందరూ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…