Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరో విజయ్ త్రిష నటించిన లియో సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అయితే ఈ సినిమా విషయంలో భాగంగా ఈయన త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి తాను పలు సినిమాలలో హీరోయిన్లతో రేప్ సన్నివేశాలలో నటించాలని కానీ ఈ సినిమాలో త్రిషతో నటించే అవకాశం రాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా త్రిషతో తనకు ఈ అవకాశం మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది అంటూ అసభ్యకర పదజాలం ఉపయోగించారు. అయితే ఈ వ్యాఖ్యలపై త్రిషా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈమెకు మద్దతుగా కుష్బూ కూడా అండగా నిలిచారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇతర సెలబ్రిటీలు కూడా ఈ త్రిషకు మద్దతుగా నిలబడటమే కాకుండా మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.
ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా త్రిషకో క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్లు వచ్చాయి కానీ మన్సూర్ మాత్రం తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటూ ఈయన తెలిపారు. అయినప్పటికీ ఈయన పట్ల చాలామంది విమర్శలు కురిపించగా బహిరంగంగా త్రిషకు క్షమాపణలు చెప్పారు.
పరువు నష్టం కేసు వేసిన మన్సూర్…
ఇకపోతే త్రిష విషయంలో తన పట్ల కామెంట్లు చేస్తూ తన పరువుకు భంగం కలిగించినటువంటి త్రిష కుష్బూ చిరంజీవి వంటి సెలబ్రిటీలపై ఈయన పరువు నష్టం కేసుతో పాటు వారు తనని మానసికంగా హింసించారని అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ఈయన వెల్లడించారు. త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ ఈయన మరోసారి సెలబ్రిటీలపై కేసు వేయడంతో ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…