Movie News

Bigg Boss 7: ఎవరైనా ఏడిస్తే యాక్టింగ్.. నువ్వు ఏడిస్తే బాధనా… వీడియోలు చూపించి మరి అమర్ కు క్లాస్ పీకిన నాగార్జున?

Bigg Boss 7: బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు మూడు వారాలు సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ వారంలో భాగంగా అశ్విని శనివారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఆదివారం కూడా మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అయితే శనివారం మాత్రం నాగార్జున హౌస్ మేట్లతో మాట్లాడుతూ వారికి తన స్టైల్ లోనే క్లాస్ పీకారు ముఖ్యంగా అమర్ దీప్ కు నాగార్జున లెఫ్ట్ రైట్ ఇచ్చారని చెప్పాలి.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అమర్ దీప్ ఎంతో దీనంగా కెప్టెన్ అవ్వాలని కోరిక నాకుంది అంటూ ఏడ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే చాలామంది అమర్ ఏడుపు పై బాధపడుతూ సింపతి చూపిగా మరి కొంతమంది ఇది అమర్ స్ట్రాటజీ అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే తాజాగా నాగార్జున కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అమర్ దీప్ కి ఇచ్చి పడేసారు.

గతంలో పల్లవి ప్రశాంత్ కూడా ఇలాగే మాట్లాడితే నువ్వు సింపతి డ్రామాలు చేయకు అంటూ అమర్ తన పై ఫైర్ అయినా సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నాగార్జున గత వీడియోలన్నింటిని కూడా ప్లే చేస్తూ..ప్రశాంత్ ను సెంటిమెంట్ డ్రామాలు ఆడద్దంటూ చెప్పావ్.. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావ్ అంటే నీది సెంటిమెంట్ డ్రామానా అని అడగ్గా నా వరకు వచ్చే వరకు ఆ బాధ నా వరకు వచ్చేవరకు తెలియడం లేదు సార్ అంటూ సమాధానం చెప్పారు.

నీ వరకు వస్తే అది బాధనా..

నీకొస్తే బాధ అవతలి వాళ్లకు వస్తే బాధా కాదా నీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏడొద్దని చెప్పారు.. అయినా ఏడుస్తూనే ఉన్నావ్ అని నాగ్ అనడంతో.. నా అనుకున్న మనుషులు నన్ను దెబ్బతీశారు అంటూ అమర్ మాట్లాడారు. అయితే శివాజీ అమర్ నాగార్జున మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ముగ్గురు మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పటికీ చివరికి అమర్ మా అమ్మ మీద ఒట్టు తన తల్లి పై ఒట్టు వేయడంతో నాగార్జున తనపై సీరియస్ అయ్యారు. నువ్వు గతంలో ఒకసారి ఇప్పుడు ఒకసారి మాట్లాడితే ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతారని అది నీకే ప్రమాదం అంటూ నాగార్జున మరోసారి అమర్ ను హెచ్చరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

21 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

21 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago