విశాఖ గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం అని అన్నారు జగన్. మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విశాఖలో గ్యాస్ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ జి పాలీమర్స్ వంటి రిప్యుటేడ్ కంపెనీలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడటంతో పాలిమరైజేషన్ జరిగిందని చెప్పారు ఏపీ సీఎం జగన్.
మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం. అలాగే ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఆస్ప్రతుల్లో 2, 3 రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు సీఎం జగన్. అంతేకాదు బాధితులకు ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్నిస్తాం అని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…