వైజాగ్ గ్యాస్ లీక్ : మృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్.

0
365

విశాఖ గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం అని అన్నారు జగన్. మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విశాఖలో గ్యాస్‌ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ జి పాలీమర్స్ వంటి రిప్యుటేడ్ కంపెనీలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడటంతో పాలిమరైజేషన్ జరిగిందని చెప్పారు ఏపీ సీఎం జగన్.

మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం. అలాగే ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఆస్ప్రతుల్లో 2, 3 రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు సీఎం జగన్. అంతేకాదు బాధితులకు ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్నిస్తాం అని చెప్పారు.