Categories: General News

రైలు కింద పడిన బ్రతికొచ్చిన రెండేళ్ల బాలుడు!

చిన్న ప్రమాదం జరిగినా, ఎన్నో గాయాలు పాలవుతారు కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.అదే ఒక రైలే తన మీదుగా వెళితే.. వేరేగా చెప్పవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. కానీ ఇక్కడ ఒక రెండేళ్ళ బాలుడు విషయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. రైలు తన మీద వెళ్ళినా కూడా చిన్న గాయం కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ అద్భుతమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందో అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఏళ్ళ బాలుడిని, 14 సంవత్సరాల తన సోదరుడు రైలు పట్టాలపైకి  తోసేసాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న గూడ్స్ రైలు ఇంజన్ లో నుంచి ఆ దృశ్యాన్ని గమనించిన లోకో పైలట్ క్షణం ఆలోచించకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేసాడు. దీంతో రైలు భారీ శబ్దం చేస్తూ ఆ బాలుడు మీదుగా వెళ్లి ఆగిపోయింది. అయితే లోకో పైలెట్ లకు గుండెజారి ఆగినంత పని అయింది. హుటాహుటిన క్యాబిన్ నుండి దిగి బాలుడు వద్దకు పరిగెత్తారు.

అక్కడ బాలుడి కేకలు విన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి ఇంచు దూరంలో ఇంజన్ చక్రం ఆగిపోవడం వల్ల, ఎలాంటి చిన్న గాయం కూడా బాబుకు తగలలేదు. అయితే పట్టాల మీదకు వచ్చిన బాబును పట్టుకొని రైల్వే అధికారులు గట్టిగా మందలించారు. తరువాత చిన్న బాబును తన తల్లి దగ్గరకు సురక్షితంగా చేర్చారు. లోకో పైలట్ దివాన్ సింగ్, అసిస్టెంట్ లోకో పైలట్ అతుల్ ఆనందాలను రైల్వే అధికారులు ప్రశంసించారు. లోకో పైలట్ లు సమయ స్ఫూర్తితో మెలగడం వల్లే ఈ ప్రమాదం తప్పిందని కొనియాడారు. ఈ ఘటన సెప్టెంబర్ 21 బల్లబ్‌గర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago