చిన్న ప్రమాదం జరిగినా, ఎన్నో గాయాలు పాలవుతారు కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.అదే ఒక రైలే తన మీదుగా వెళితే.. వేరేగా చెప్పవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. కానీ ఇక్కడ ఒక రెండేళ్ళ బాలుడు విషయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. రైలు తన మీద వెళ్ళినా కూడా చిన్న గాయం కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ అద్భుతమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందో అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఏళ్ళ బాలుడిని, 14 సంవత్సరాల తన సోదరుడు రైలు పట్టాలపైకి తోసేసాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న గూడ్స్ రైలు ఇంజన్ లో నుంచి ఆ దృశ్యాన్ని గమనించిన లోకో పైలట్ క్షణం ఆలోచించకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేసాడు. దీంతో రైలు భారీ శబ్దం చేస్తూ ఆ బాలుడు మీదుగా వెళ్లి ఆగిపోయింది. అయితే లోకో పైలెట్ లకు గుండెజారి ఆగినంత పని అయింది. హుటాహుటిన క్యాబిన్ నుండి దిగి బాలుడు వద్దకు పరిగెత్తారు.
అక్కడ బాలుడి కేకలు విన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి ఇంచు దూరంలో ఇంజన్ చక్రం ఆగిపోవడం వల్ల, ఎలాంటి చిన్న గాయం కూడా బాబుకు తగలలేదు. అయితే పట్టాల మీదకు వచ్చిన బాబును పట్టుకొని రైల్వే అధికారులు గట్టిగా మందలించారు. తరువాత చిన్న బాబును తన తల్లి దగ్గరకు సురక్షితంగా చేర్చారు. లోకో పైలట్ దివాన్ సింగ్, అసిస్టెంట్ లోకో పైలట్ అతుల్ ఆనందాలను రైల్వే అధికారులు ప్రశంసించారు. లోకో పైలట్ లు సమయ స్ఫూర్తితో మెలగడం వల్లే ఈ ప్రమాదం తప్పిందని కొనియాడారు. ఈ ఘటన సెప్టెంబర్ 21 బల్లబ్‌గర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























