ఈ కాలం యువత పబ్ జి కి ఎలా అడిక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పబ్ జి ఆటకు బానిసై పోయారు. గంటల తరబడి పబ్ జి ఆటలో మునిగిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో పబ్ జి బ్యాన్ అవ్వడం వల్ల కాస్త యువత కోలుకుంటుంది కానీ గతంలో ఈ ఆటకు బానిసై, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పబ్ జి ఆడడానికి తల్లితండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ లకు బానిసై ఎంతో మంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. అయితే పబ్ జి ఆట వల్ల ఇప్పుడు మరో షాకింగ్ ఘటన జరిగింది.
తమిళనాడుకు చెందిన బాబిష అనే 20 ఏళ్ల యువతి లాక్ డౌన్ కారణంగా ఇంట్లో బోర్ కొడుతుండడంతో పబ్ జి ఆట ఆడటం మొదలు పెట్టింది. ఆన్లైన్ లో ఆట ఆడుతున్న సమయంలో ఆమెకు అజిత్ ప్రిన్స్ అనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ గంటలకొద్దీ మాట్లాడుతూ ఇంకా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే సమస్యగా మారుతుందని బాబిష, అజిత్ ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో బాబిష తల్లిదండ్రులు తిరువత్తర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటికే వారిద్దరి వివాహం జరిగిపోయింది. అయితే బాబిష అజిత్ దగ్గర ఉండడానికే ఇష్టపడటంతో తల్లితండ్రుల వద్దకు ఆమె వెళ్ళమని చెప్పిన వెళ్ళలేదు. ప్రస్తుతం పబ్ జి ప్రేమ కథ నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…