Categories: FeaturedMovie News

తనకే పాపం తెలియదని చెబుతున్న రకుల్… అధికారులు ఏం చేస్తారో..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఆమె వివాదాలకు దూరంగానే ఉంది. అటు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూనే ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా రకుల్ సుశాంత్ మృతి తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించిన అధికారులు డ్రగ్స్ కేసుతో రకుల్ కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

నిన్ననే రకుల్ ఎన్సీబీ అధికారుల ముందు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆమెకు సమన్లు ఆలస్యంగా అందడంతో ఈరోజు హాజరైంది. ఈరోజు ముంబైకు వెళ్లి విచారణకు హాజరైన రకుల్ ను విచారించి అధికారులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అధికారులతో ఆమె తనకు రియా చక్రవర్తితో పరిచయం ఉన్నట్టు అంగీకరించింది. రియాతో తను చాట్ కూడా చేసినట్టు ఒప్పుకుంది.
 
రియాతో తనకు పరిచయం ఉన్నప్పటికీ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. గతంలో తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె అధికారులకు వెల్లడించింది. తనకు కనీసం పొగ తాగే అలవాటు కూడా లేదని రకుల్ పేర్కొందని సమాచారం. ఎన్సీబీ రకుల్ ను విచారించగా స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (ఎస్ఐటీ) ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.
 
డ్ర‌గ్స్ కేసులో అధికారులు వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ఎన్సీబీ డైరెక్టర్ అశోక్ జైన్ రకుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి కోర్టుకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి రకుల్ బయటపడుతుందో లేదో చూడాల్సి ఉంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago