టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఆమె వివాదాలకు దూరంగానే ఉంది. అటు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూనే ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా రకుల్ సుశాంత్ మృతి తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించిన అధికారులు డ్రగ్స్ కేసుతో రకుల్ కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

నిన్ననే రకుల్ ఎన్సీబీ అధికారుల ముందు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆమెకు సమన్లు ఆలస్యంగా అందడంతో ఈరోజు హాజరైంది. ఈరోజు ముంబైకు వెళ్లి విచారణకు హాజరైన రకుల్ ను విచారించి అధికారులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అధికారులతో ఆమె తనకు రియా చక్రవర్తితో పరిచయం ఉన్నట్టు అంగీకరించింది. రియాతో తను చాట్ కూడా చేసినట్టు ఒప్పుకుంది.
రియాతో తనకు పరిచయం ఉన్నప్పటికీ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. గతంలో తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె అధికారులకు వెల్లడించింది. తనకు కనీసం పొగ తాగే అలవాటు కూడా లేదని రకుల్ పేర్కొందని సమాచారం. ఎన్సీబీ రకుల్ ను విచారించగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.
డ్రగ్స్ కేసులో అధికారులు వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ఎన్సీబీ డైరెక్టర్ అశోక్ జైన్ రకుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి కోర్టుకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి రకుల్ బయటపడుతుందో లేదో చూడాల్సి ఉంది.



























