Mega Family: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పృధ్విరాజ్ గత ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. వైసిపి పార్టీ కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంచి పదవి ఇచ్చారు.
అయితే పృథ్విరాజ్ చేసిన కొన్ని పనుల కారణంగా తనని ఆ పదవి నుంచి తొలగించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కారణంతో ఆయన సినీ ప్రముఖులను తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే తనకు రాజకీయాలలో చేదు అనుభవం ఎదురవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా మెగా కుటుంబానికి పృధ్విరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నేను వ్యతిరేక పార్టీ అని తెలిసినా కూడా చిరంజీవి గారు నాకు సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు. ఇలా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాకు ఎలాంటి గౌరవం ఇచ్చిన వీరందరిని అవమానించాను. నా అనుకున్న వాళ్లు నాకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా పృధ్వి రాజా వెల్లడించారు.
ఇక కరోనా వంటి విపత్కర సమయంలో నేను కరోనా బారినపడినప్పుడు నాకు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంచి ఆదరణ లభించిందని చాలామంది నాకు ధైర్యం చెప్పి పునర్జన్మ ఇచ్చారని పృథ్వీరాజ్ వెల్లడించారు. కరోనా నుంచి బయట పడిన తరువాత ఇలా తను అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అందరితో కలిసి పోవాలని భావించానని అందుకే గతంలో నేను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. నేను ఒక్క అడుగు వేస్తే వారు నాకు వేయి అడుగులు వేయడానికి సహాయం చేస్తారని ఈ సందర్భంగా పృథ్విరాజ్ వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…