దర్శకధీరుడు రాజమౌళి తీసే సినిమాలకు కథ అందించేది అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్..అయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించినా అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ప్రస్తుతం RRR సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలకానుంది. ఈనేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ల లో బిజీ బిజీగా గడుపుతున్నారు. RRR మేకర్స్.. విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆశక్తికర విషయాలు చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.
ఒక జర్నలిస్ట్ కులాల ప్రస్తావన తెస్తూ.. ఎన్టీఆర్ కమ్మ కులం.. రామ్ చరణ్ కాపు కులమని ఇలా కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిచారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 1966లో తనకు పెళ్లి అయిందని.. తనది కమ్మ కులమని.. కానీ తన భార్య కులమెంటో తనకు అప్పుడు తెలియదని చెప్పారు. ఆసమయంలో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లి సమయంలో ఆమె కులం ఏంటి అన్నది తనను ఎప్పుడూ అడగలేదని.. అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారు.
అయితే ఖైదీ సినిమా రిలీజ్ అయిన సమయంలో తను మా చిరంజీవి.. మా చిరంజీవి అని తను అనేదని.. అన్నారు. ఆమె అన్ని సార్లు అలా అంటుండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగేసా.. “మాట్లాడితే మా చిరంజీవి అంటావ్ ఎందుకు” అని.. అప్పుడు ఆమే “మా ఇద్దరిదీ ఒకటే కులం” అని తన భార్య చెప్పిందని.. అందుకే మా చిరంజీవి అంటుందని తెలుసుకున్నానన్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి వలెనే తన భార్య కులం తనకి తెలిసిందని చెప్పారు విజయేంద్రప్రసాద్.
ఇక తమ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లు ఎక్కువగా జరిగాయని.. మా ఇంట్లో అమ్మాయిలు కూడా ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో ఎప్పుడూ కులాల ప్రస్తావన ఉండదని అలాంటిది కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది అసలు జరిగే చాన్స్ లేదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…