Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల కోసం మరి దారుణానికి పాల్పడిన అభిమానులు.. ఏం చేశారంటే?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (మార్చి 25 వ తేదీ) విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏకంగా మూడు రోజుల వరకు టికెట్లు బుక్ అయ్యాయి. ఇక ఈ సినిమాని మొదటిరోజు చూడటం కోసం ఎంతో మంది తెలుగు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల కోసం మరి దారుణానికి పాల్పడిన అభిమానులు.. ఏం చేశారంటే?

ఈ క్రమంలోనే మొదటిరోజు ఈ సినిమా చూడటానికి కుదరకపోవడంతో తమకు టికెట్లు కావాలని ఏకంగా హైదరాబాద్ లో ఒక మల్టీ ఫ్లెక్స్ మేనేజర్ కు తీవ్రస్థాయిలో బెదిరింపులు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వెళ్లి మేము ఫలానా మంత్రి అనుచరులము, ఫలానా పోలీసు ఉన్నతాధికారి మనుషులము అని వారి పేర్లు చెబుతూ పదుల సంఖ్యలో టిక్కెట్లు కావాలని ఒత్తిడి తెస్తున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల కోసం మరి దారుణానికి పాల్పడిన అభిమానులు.. ఏం చేశారంటే?

ఈ క్రమంలోనే అన్ని టికెట్లు ఇవ్వడం కుదరలేదు 2,3 అంటే సర్దుబాటు చేస్తామని మల్టీప్లెక్స్ సిబ్బంది చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం ఏంటి ఈ మల్టీప్లెక్స్ ఉండాలనుకుంటున్నారా? లేదా? అంటూ దారుణంగా వారికి బెదిరింపులు చేస్తున్నారు. ఇక ఈ ఒత్తిడిని భరించలేక మల్టీప్లెక్స్ మేనేజర్ అధిక బీపీతో ఏకంగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

నిర్మాత దానయ్యకు తప్పని తిప్పలు…

ఇలా కేవలం థియేటర్ ఓనర్, మేనేజర్ కి మాత్రమే కాకుండా నిర్మాత దానయ్యకు సైతం ఈ టికెట్ల ఒత్తిడి తగ్గలేదు. ఆయన కూడా మొదటి షో కి టికెట్లను సర్దుబాటు చేయలేక పోతున్నారు. మరోవైపు రాజమౌళికి కూడా టికెట్ల ఒత్తిడి తప్పలేదనే చెప్పాలి. ఈ విధంగా సినిమా టికెట్ల కోసం బాహుబలి సినిమాకు ఇలాంటి ఒత్తిడి ఏర్పడింది. తిరిగి ఆర్ఆర్ఆర్ సినిమాకు అదే స్థాయిలో సినిమా టికెట్ల కోసం ఒత్తిడి తీసుకురావడమే కాకుండా బెదిరిస్తున్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago