పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల మనిషికి ఎలాంటి రోగాలు దరిచేరవు. వాటితో పాటు రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీంతో పాటు కొన్ని పండ్లను తింటే ఆ రోజంతా ఉల్లాసంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి. ఏ రోగినైనా వైద్యులు పండ్లను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటాడు. రోజుకొక పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు పండ్లలోనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే.. కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇవి మానవ శరీరంలో విషంగా మారే ప్రమాదం కూడా ఉంది.
అవేంటో తెలుసుకుందాం.. బొప్పాయిని.. నిమ్మకాయను కలిపి తింటే మాత్రం హిమోగ్లోబిన్ కు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. అంతే కాకుండా రక్తహీనతకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండో కాంబినేషన్ ఏంటంటే.. ఆరెంజ్ మరియు క్యారెట్. ఇవి రెండు కలిపి తింటే మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మూడో కాంబినేషన్ వచ్చేసి.. అరటిపండు మరియు జామ. ఇవి రెండు మనకు దొరకుతూ ఉంటాయి.
కానీ ఈ కలయిక అనేది చాలా డేంజర్. ఈ రెండింటిని కలిపి తింటే.. పొట్టలో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నాలుగో కాంబినేషన్ ఏంటంటే.. నేరేడు పండు మరియు దానిమ్మ. ఈ రెండింటిని కూడా కలిపి తినకూడదు. కడుపులో అజీర్తి, ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
అలాగే వాటిలో ఉండే అధిక చక్కెర ప్రోటీన్లను జీర్ణం చేసే శరీరంలోని ఎంజైమ్‌లను చంపేస్తుంది.
ఇక చివరది.. ఐదో కాంబినేషన్ ఏంటంటే.. పాయసం మరియు అరటిపండు. పాయసం వండినప్పుడు కొంతమంది అరటిపండు కూడా ఇస్తుంటారు. కానీ ఇలా కాంబినేషన్ లో తినకూడదు. దీని వల్ల శరీరంలో టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా పొట్టలో భారమైన భావన కూడా కలుగుతుంది. ఇప్పటి నుంచి పైన చెప్పిన విధంగా కాంబినేషన్ లో పండ్లను తినడం మానేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…