General News

నటి హేమకు షాక్..షోకాజ్‌ జారీచేసిన “మా”..!

గత రెండు రోజుల క్రితం నటి హేమ “మా” అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని, మా అసోసియేషన్ కు నిధులు సమకూర్చుకుండా ఉన్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారంటూ ప్రస్తుతమున్న మా అధ్యక్షుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎలక్షన్లు జరగకుండా మరికొన్ని రోజులపాటు తానే అధికారంలో ఉండాలని మా అధ్యక్షుడు భావిస్తున్నారని హేమ ఆరోపించారు.

ఈ క్రమంలోనే హేమ మా అధ్యక్షుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆడియో టేప్ బయటకు వచ్చింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు జరగాలని హేమ సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై సోమవారం మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ నటి హేమకు కౌంటర్ వేశారు.

ఈ క్రమంలోనే మా పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. ఈ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేస్తూ మా ప్రతిష్టను దిగజారుస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని తక్షణమే ఎన్నికలు జరపాలంటూ చిరంజీవి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడంతో వెంటనే క్రమశిక్షణ సంఘం స్పందించి నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు నరేష్ పై చేసిన ఆరోపణలకు ఆమెను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు కూడా జరిగేలా చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం తెలియజేసింది. అయితే ఈ సారి మా ఎలెక్షన్ బరిలో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, హేమ,సీవీఎల్‌ నర్సింహ రావు తదితరులు పోటీలో నిలబడ్డారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago