Categories: FeaturedGeneral News

మర్కజ్ ప్రార్ధనల తరువాత ఆ ఐదు రైళ్లలో ప్రయాణించిన ప్రచారకులు !!

ఢిల్లీ లోని మర్కజ్ భావం భవన్ లో జరిగిన ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి మత ప్రచారకులు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో దక్షిణాది రాష్ట్రాల వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం మన దేశంలో తక్కువగానే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మర్కజ్ ఉదంతం బయటపడేసరికి దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ లోని మర్కజ్ భవన్ ప్రార్ధనలు ముగిసిన తరువాత ఐదు రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు మత ప్రచారకులు ప్రయాణించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మర్చి 13 నుంచి 19వ తేదీ మధ్యలో ఈ ప్రయాణాలు జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

గుంటూరు దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌, చెన్నైకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ – రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లు బయలుదేరాయి. ఈ రైళ్లలో సుమారు 1000 నుంచి 1200 చొప్పున ప్రయాణించిన వారిలో అత్యధికంగా మత ప్రార్థనలకు హాజరైన వారే ఉన్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇది వరకే కరీంనగర్లో 10 మంది ఇండోనేషియన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీరు మర్చి 13వ తేదీన మత ప్రార్థనల్లో పాల్గొని ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరీంనగర్ కు వచ్చారు. అదేవిధంగా న్యూఢిల్లీ – రాంచి ఎక్స్‌ప్రెస్‌ 60 మంది వరకు ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. అయితే చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణించిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

1 hour ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

3 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

3 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago