Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్,పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి అందరికీ సుపరిచితమే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే అందరితోనూ ఎంతో సరదాగా గడుపుతారు. అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక ఈయన సినిమా షూటింగ్ లో ఉన్నారంటే షూటింగ్ లొకేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ వివిధ రకాల పసందైన భోజనం ఇంటి నుంచి తెప్పిస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పెట్టే భోజనం గురించి ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తాజాగా ప్రభాస్ ఏకంగా ఆరడుగుల కేక్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ డార్లింగ్ ప్రభాస్ ఎవరి కోసం ఇంత పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చారో తెలుసా…
కేజిఎఫ్ చిత్రం ద్వారా దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కోసం ప్రభాస్ ఆరడుగుల కేక్ ఆర్డర్ చేసి తయారు చేయించారు. తాజాగా ప్రశాంత్ తన పుట్టిన రోజును జరుపుకోవడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ ఇలాంటి సర్ప్రైస్ ఇచ్చారు. ప్రశాంత్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రభాస్ తో పాటు కన్నడ హీరో యష్ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ కోసం ఏకంగా ఆరు అడుగుల కేక్ తయారు చేయించి పంపించడమే కాకుండా హ్యాపీ బర్త్ డే ప్రశాంత్ నీల్ నీవు మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. అంటూ తెలియచేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమా చేయడంతో ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…