ప్రస్తుతం సమాజంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజూ ఎదో ఒక చోట ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిర్భయ, దిశా లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు.
ఒంటరిగా ఆడపిల్ల భయటకు వచ్చిందంటే ఇంటికి జాగ్రత్తగా వెళ్తుందో.. లేదో అన్న భయం కుటుంబసభ్యుల్లో నెలకొంది. తాజాగా సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి రెండు రోజుల అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలిక అదే గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. అదే దుకాణానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. ఆ బాలికతో అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా ఆమె వెనుక వెంటడ్డాడు. చెయ్యి పట్టుకొని ఆమెను అత్యాచారం చేయడానికి యత్నించాడు. భయటపడిపోయిన ఆ బాలిక కేకలు వెయ్యడం మొదలు పెట్టింది. దీంతో అక్కడ నుంచి వృద్ధుడు పరారయ్యాడు.
ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు.. వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…