Categories: FeaturedMovie News

వీడు నిజంగానే జాతిరత్నం సపోర్ట్ చేస్తే స్టార్ అవుతాడు.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలలో 80 శాతం నట వారసులే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన తమ్ముళ్ళు నాగబాబు నిర్మాతగా, చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అదే ఫ్యామిలీ నుంచి చిరు తనయుడు రాం చరణ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, మేనల్లుళ్ళు సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్, నిహారికా.. ఇలా ఓ పదిమంది మెగా వారసులే ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగుతున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేశ్ – రానా హీరోలుగా వెలుగుతున్నారు.

అలాగే అక్కినేని నాగేశ్వర రావు ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ హీరోలుగా కొనసాగుతుంటే మిగతావారు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన తనయులు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టార్‌గా వెలుగుతున్నాడు. ఆయన పెద్ద కొడుకు నటుడిగా, నిర్మాతగా కొంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాడు. కూతురు మంజుల నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. వీరే కాదు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, గల్లా అశోక్ లాంటి యంగ్ హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఇక మన నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, కళ్యాణ్  రాం, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లాంటి వారు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ దక్కించుకొని వెలుగుతున్నారు. ఇలానే మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న సహా మరి కొంతమంది నట వారసులు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని కొనసాగుతున్నారు. ఇంతమంది మధ్యలో కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని మాస్ మహారాజాగా రవితేజ, నేచురల్ స్టార్‌గా నాని లాంటి వారు ఎదిగారంటే అది వారి స్వయంకృషి అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే వీరికి కొందరు హీరోలు, దర్శక, నిర్మాతలు సపోర్ట్ చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు.

అలా సపోర్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ఇండస్ట్రీలో మరో ఆణిముత్యం, జాతిరత్నం తయారవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న వేశాల దగ్గర్నుంచి ఇప్పుడు బడా నిర్మాణ సంస్థల్లో హీరోగా సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు వరుసగా సినిమాలకి సైన్ చేస్తున్నాడు. అవి కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ లాంటి సంస్థలలో.. ప్రస్తుతం నవీన్ పొలిశెత్తి చేతిలో ఆరేడు సినిమాలున్నాయని సమాచారం.

యూవీ వారు నిర్మించే సినిమాలో అనుష్క శెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు నవీన్ పొలిశెట్టికి ఉన్న క్రేజ్ దృష్ఠిలో పెట్టుకొని నిర్మాతలు దాదాపు 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. అంత క్రేజ్ వచ్చిన ఈ యంగ్ హీరోను జన్యూన్‌గా గనక సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. చుడాలి మరి ఇతని ఫేట్ ఎలా ఉందో. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిని నిచ్చెన ఎక్కిస్తారో.. ఎప్పుడు కిందపడేసి తొక్కేస్తారో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికైతే నవీన్ ఫ్యూచర్ బాగానే కనిపిస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago