గత కొన్ని రోజుల నుంచి తగ్గుకుంటూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,800 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. బంగారం ధర రూ.200 మేర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది.
వెండి ధర ఒక కిలోకు రూ.400 తగ్గింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.63,800 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,720 గా ఉంది.
ఇక హైదరాబాద్ లో అయితే 2 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460 ఉంది. ఇలా బంగారం పెరగడం తగ్గడంలో వివిధ రకాల కారణాలు ఉంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…