Categories: FeaturedGeneral News

పొలంలో కనిపించిన స్కూల్ యూనిఫామ్.. ఏంటని వెళ్లి చూస్తే షాక్ అయిన స్థానికులు..!

ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ మానవమృగాలు మాత్రం రోజురోజుకు రెచ్చిపోయి చిన్నపిల్లలు పండు ముసలి వాళ్ళు అని తారతమ్యం లేకుండా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఇలా అత్యాచార ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా కొందరు మానవ మృగాలు అదేస్థాయిలో రెచ్చిపోయి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వారం రోజుల క్రితం జరిగిన హైదరాబాద్ ఘటన మరవకముందే అలాంటి ఘటన ఆగ్రాలో మరొకటి చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన ఆగ్రాలోని అలీఘర్‌లోని టప్పల్ ప్రాంతంలో ప్రాంతంలో చోటు చేసుకుంది.

స్థానిక కథనం ప్రకారం… ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరి పొలంలో స్కూల్ యూనిఫామ్ కనిపిస్తుండడంతో స్థానికులు ఆ వరిపొలంలోకి వెళ్లిచూడగా ఎనిమిదేళ్ల చిన్నారి అచేతనంగా పడి ఉండటం చూసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.

అయితే ఉదయం 9 గంటల సమయంలో బాలిక పాఠశాలకు వెళ్లిందని, అయితే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వరి పొలంలో మధ్యాహ్నం బాలిక శవమై కనిపించదని బాలిక బంధువులలో ఒకరు తెలిపారు. బాలిక మృతదేహం ఉన్న చోట నుంచి 100 మీటర్ల దూరంలో తన స్కూల్ బ్యాక్ పడి ఉందని, ఆ బాలిక స్కూలుకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే పాపను ఎవరో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో వైద్య సేవలకు గోల్డెన్ ఛాన్స్… ఫ్రీ వసతి, భోజనం, ప్రొటోకాల్ దర్శనం!

తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…

3 minutes ago

“అమ్మాయిలూ… ఉదయం ఈ చిన్న అలవాటు పెంచుకుంటే జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది!”

అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…

17 minutes ago

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

1 hour ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 hour ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

13 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

16 hours ago