Categories: General News

వలపు వలలో పడ్డ 80 ఏళ్ల వృద్ధుడు.. రూ.9 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు

ముంబై: సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడు, ఫేస్‌బుక్‌లో ఓ పరిచయం కారణంగా ఏకంగా దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. డెమెన్షియా (మతిమరుపు) ఉన్న ఈ వృద్ధుడి బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు.

80-year-old man loses Rs. 9 crore to the deceit of 4 women..

ఫేస్‌బుక్‌లో మొదలైన స్నేహం..

2023 ఏప్రిల్‌లో ముంబైకి చెందిన ఆ వృద్ధుడు షార్వి అనే మహిళకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. మొదట ఆమె తిరస్కరించినా, కొద్దిరోజుల తర్వాత తిరిగి రిక్వెస్ట్ పంపి స్నేహం మొదలుపెట్టింది. వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత, ఆమె తన భర్త నుంచి విడిపోయానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెబుతూ డబ్బులు అడిగింది. ఆమె మాటలు నమ్మి వృద్ధుడు పలు దఫాలుగా డబ్బు పంపించాడు.

నకిలీ అకౌంట్లతో మోసం

ఆ తర్వాత, కవిత అనే మరో మహిళ షార్వి ద్వారా పరిచయం అయినట్లు చెప్పి, అసభ్యకరమైన సందేశాలు పంపి డబ్బులు డిమాండ్ చేసింది. దీనితో పాటు, దినాజ్ అనే పేరుతో వచ్చిన మరొక అకౌంట్ నుంచి తాను షార్వి సోదరినని చెప్పి, షార్వి చనిపోయిందని అబద్ధం చెప్పింది. ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు వసూలు చేయడంతో పాటు, పెళ్లి చేసుకోవాలనే ఆశలు రేకెత్తించి మరింత డబ్బును లాగింది. ఇంత జరిగినా మేలుకోని వృద్ధుడు, జాస్మిన్ అనే మరో మహిళ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను కూడా అంగీకరించి, ఆమెకు కూడా డబ్బు పంపించాడు.

అసలు విషయం బయటపడిందిలా..

మొత్తంగా 21 నెలల్లో నాలుగు నకిలీ అకౌంట్లకు 734 సార్లు నగదు బదిలీ చేసి, దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. తన దగ్గర డబ్బు అయిపోవడంతో, కోడలి దగ్గర రూ. 2 లక్షలు, కొడుకు దగ్గర రూ. 5 లక్షలు అడగగా, కొడుకుకు అనుమానం వచ్చి నిలదీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు తీవ్ర ఆవేదనతో ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్యులు డెమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. జూలై 22న కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు మహిళల పేర్లు ఉన్నప్పటికీ, వేర్వేరు నంబర్లతో ఒకే వ్యక్తి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago