భార్య వండిన చికెన్ బాగా వండలేదని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. తర్వాత ఆమె శవాన్ని ఓ సరస్సులో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాడు. ఐదు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన 30 ఏళ్ల పాషా, 28 ఏళ్ల షరిన్ భాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అతడు బెడ్స్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఓ రోజు షరిన్ చెల్లి వాళ్ల ఇంటికి వచ్చింది. మరదలు వచ్చింది కదా అన్ని పాషా.. బయటకు వెళ్లి చికెన్ తీసుకొని వచ్చాడు. అయితే ఆమె దానిని ఫ్రై చేసింది. ఇంట్లో వాళ్లంతా కలిసి తింటున్న క్రమంలో చికెన్ మంచిగా వండలేదని.. ఇదేం వంట చేయడం అంటూ .. షరిన్ పై తన చెల్లి ముందే గొడవ పడ్డాడు.
పెళ్లి అయి ఇన్నాళ్లు అవుతున్నా వంట వండటం రాదా అంటూ ఆమెపై కస్సుబుస్సు అయ్యాడు. తన చెల్లి ముందే అతడు ఇన్ని మాటలు అన్నందకు షరిన్ బాగా బాధపడింది. తన చెల్లి ఉన్నన్ని రోజులు గొడవలు లేకుండా ఇద్దరు ఉన్నారు. ఆమె వెళ్లిన దగ్గర నుంచి మళ్లీ గొడవ పడటం మొదలు పెట్టారు.
ఓ రోజు పిల్లలు పడుకున్న సమయంలో మళ్లీ అతడు ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమె శవాన్ని చిక్కబనవర లేక్‌లో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మృతదేహం కోసం ఆ సరస్సులో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…