Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన హీరోగా నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే సినిమాల పరంగా మధ్య సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ రంగంలో కూడా ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని నేడు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈయన ఏపీ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా ఇతర ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈయన ఎన్నికలలో గెలవకముందు ఓ కార్యక్రమంలో భాగంగా చాలా సీరియస్ గా స్పీచ్ ఇస్తున్న క్రమంలో ఒక యువతి ఐ లవ్ యు సర్ అంటూ చెప్పుకు వచ్చారు.
ఈ విధంగా ఆ యువతి అందరి ముందు పవన్ కళ్యాణ్ కు ఐ లవ్ యు చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ షాక్ అవ్వడమే కాకుండా అమ్మాయిలు ఏంటి మరి ఇలా రౌడీలా తయారవుతున్నారు అంటూ సరదాగా నవ్వుతూ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చేసాయి. అయితే గతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
రౌడీలా తయారవుతున్నారు…
ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను కమిట్ అయిన సినిమా షూటింగ్లన్నీ కూడా ఆగిపోయాయి. తనకు వీలైనప్పుడు ఆ సినిమాలను పూర్తి చేస్తానని నిర్మాతలకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మరి ఈయన నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరుమల్లు వంటి సినిమాలు కొంత భాగం షూటింగ్ పనులను జరుపుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…