చిరుతపులి దేనినైనా వేటాడిందంటే..దాని నుంచి కాపాడుకోవడం ఎవరి వల్ల కాదు. అంతాల తన వేట కొనసాగుతుంది. ఇలా పులి, పిల్లిని వేటాడుతూ.. దగ్గర్లోని బావిలో పడిపోయాయి. పిల్లి తొందరగానే గట్టుకు చేరుకుంది. కానీ పులి కూడా గట్టుకు చేరింది. దీంతో ఆ పిల్లి పరిస్థితి మాత్రం.. ఆగమ్యగోచరంగా మారింది. ఈ ఘటన మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి విరాల్లోకి వెళ్తే..
ఆ పల్లి చిరుతపులి కంట పడింది. ఇంకా ఏమైనా ఉందా.. వేట మొదలు పెట్టింది. ఇలా తనకు తాను రక్షించుకోవడం కోసం.. పిల్లి తప్పించుకోబోయి.. పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో పడిపోయింది. దీంతో పాటు చిరుతపులి కూడా అందులోనే పడిపోయింది. దీంతో పిల్లి వెంటనే బావిలోపల గల గట్టుపైకి ఎలాగోలా చేరుకుంది. తర్వాత అది అక్కడ నుంచి ఎటూ వెళ్లలేక అక్కడనే ఉండిపోయింది.
దీంతో చిరుత పులి.. పిల్లి ఉన్న ప్రదేశానికి వచ్చి.. దానిని ఎటాక్ చేసింది. పిల్లి కూడా కాసేపు డిఫెన్స్ చేసింది. కానీ చిరుత కింద.. పిల్లి ఒక లెక్కా.. మళ్లీ దూకుడుగా చిరుత పిల్లిపైకి ప్రవర్తించగా.. ముందు రెండు కాళ్లతో దండం పెట్టేంత పని చేసింది పిల్లి. దీంతో చిరుతకూడా దానిని ఏం చేయకుండా అలా ఉండిపోయింది.
దినికి సంబంధించిన ఈ 16 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లి భయంతో వణికిపోతున్న దృశ్యం.. అలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లి.. చిరుత పులిని జాలిగా చూడటం నెటిజన్లను ఆకర్షిస్తోంది. చివరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వాటిని బావిలోనుంచి బయటకు తీశారు. చిరుతను పట్టుకున్న అధికారులు.. పిల్లిని వదిలిపెట్టారు. బతుకుజీవడా అనుకొని పిల్లి అక్కడ నుంచి పారిపోయింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…