Categories: FeaturedMovie News

రజనీకాంత్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు బాలీవుడ్ హీరో.. ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి సంఘటన ఒక మధుర జ్ఞాపకమే. ఇక ఏ వ్యక్తికైనా వారి బాల్యం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఈ తరుణంలోనే చిన్నప్పటి జరిగిన సన్నివేశాలను ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలను చూసుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాలనటులుగా అడుగు పెట్టారు.

ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారు అతి కొంత సమయంలోనే హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన వారే. ఈ క్రమంలోనే అలాంటి ఫోటోలు కనిపించగానే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా అంటూ.. వారి మెదడుకు పదును పెడుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి అంటూ పెద్దఎత్తున ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలను సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.1986 రజనీకాంత్ హిందీలో నటించినటువంటి చిత్రం “భగవాన్ దాదా”. ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్ నిర్మించారు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ దత్తపుత్రుడిగా 12 సంవత్సరాల కుర్రోడు సందడి చేశాడు. అయితే ఆ కుర్రాడు ఎవరు అనే విషయానికి వస్తే రజనీకాంత్ భగవాన్ దాదా సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన టువంటి రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago