సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి సంఘటన ఒక మధుర జ్ఞాపకమే. ఇక ఏ వ్యక్తికైనా వారి బాల్యం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఈ తరుణంలోనే చిన్నప్పటి జరిగిన సన్నివేశాలను ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలను చూసుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాలనటులుగా అడుగు పెట్టారు.

ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారు అతి కొంత సమయంలోనే హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన వారే. ఈ క్రమంలోనే అలాంటి ఫోటోలు కనిపించగానే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా అంటూ.. వారి మెదడుకు పదును పెడుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి అంటూ పెద్దఎత్తున ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలను సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఉన్నారు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.1986 రజనీకాంత్ హిందీలో నటించినటువంటి చిత్రం “భగవాన్ దాదా”. ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్ నిర్మించారు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ దత్తపుత్రుడిగా 12 సంవత్సరాల కుర్రోడు సందడి చేశాడు. అయితే ఆ కుర్రాడు ఎవరు అనే విషయానికి వస్తే రజనీకాంత్ భగవాన్ దాదా సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన టువంటి రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
































