Crime News: పుట్టిన రోజు వేడుకల్లో భర్త స్నేహితులు.. భార్యపై కన్నేసిన కామాంధులు..! తర్వాత ఏమైందంటే..?
Crime News: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా.. కామాంధుల తీరు మారడం లేదు. నిర్భయ, ఫోక్సో, దిశ వంటి చట్టాలు తీసుకువచ్చినా… దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన దుండగుల్లో మనకు ఏం కాదనే భావన ఉండటంతోనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు.
వావీవరస, చిన్న పెద్దా, ఆడ మగ అన్న తేడాలు లేకుండా.. దారుణాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి నుంచే ఎక్కువగా లైంగిక దాడులకు గురవ్వడం కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా పూణేలో జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం కలిగించింది. భర్తతో వెళ్లిన భార్యను భర్త స్నేహితులే సామూహిక అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళితే భర్త బర్త్ డే పార్టీని జరుపుకునేందుకు వెళ్లిన భార్య ఈ దారుణానికి బాధితురాలుగా మారింది. పుణేలో భర్త బర్త్ డే రోజు ఏకాంతం కోసం భార్యభర్తలు ఓ హోటల్ కి వెళ్లారు. ఇదే సమయంలో మాయమాటలు చెప్పిన భర్త స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
భర్త హోటళ్లో ఎంక్వయిరీకి వెళ్లిన సందర్భంలో.. అతని స్నేహితులు బాధితురాలి దగ్గరికి వచ్చి మీ సోదరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని మాయమాటలు చెప్పారు. ఇది నమ్మిన ఆమె అతనితో మోటర్ సైకిల్ పై బయటకు వెళ్లింది. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత అతనితో వచ్చిన వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దురాగతానికి పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…