Budget 2022-23: కేంద్ర బడ్జెట్..! నిరుద్యోగులకు తీపి కబురు..! వాటిల్లో రూ.60 లక్షల ఉద్యోగాలు.. !
Budget 2022-23: కొన్ని నిమిషాల క్రితమే కేంద్ర బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఎదురు చూస్తున్న మినహాయింపులు ఇస్తారా .. లేదంటే.. అంతకముందు ఉన్న బడ్జెట్ల మాదిరిగానే ఉంటుందా అనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.
అయితే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు తలకిందులు అయ్యాయని.. వాటి నుంచి ప్రతీ ఒక్కరూ బయటపడాలని కోరుకుంటున్నాట్లు పేర్కొన్నారు.
ఇక ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ యొక్క ఉపయోగంపై క్యాంపెయిన్ జరుగుతోందని.. ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని, మరో 25 ఏళ్ల విజన్‌తో తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందన్నారు.
ఇక డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ఆ విధంగానే కేంద్రం ముందుకు వెళ్తుందని అన్నారు. డిజిటల్ ఎకానమీని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఈ ప్రసంగంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు కేంద్ర మంత్రి. రాబోయే రోజుల్లో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో ఎక్కువ ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా.. వాటిల్లో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…