Adi Pinishetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి.. వధువు ఎవరో తెలుసా?
Adi Pinishetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో, నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆది పినిశెట్టి ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు విలన్ క్యారెక్టర్ లలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంది అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆది పినిశెట్టి ని వారి సినిమాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆది పినిశెట్టి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక అది సినిమాలో పాత్ర ఏదైనప్పటికీ ఆ పాత్రలో పూర్తిగా లీనమై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అదేవిధంగా సినిమా సినిమాకు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం బోలెడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆది పినిశెట్టి త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆది పినిశెట్టి గత కొంతకాలంగా నిక్కీ గల్రానీ తో కలిసి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. నిక్కీ గల్రానీ గురించి అందరికి తెలిసిందే.
ఈమె కూడా కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈమె బుజ్జిగాడు సినిమా ఫిలిం సంజన గల్రానీ కి చెల్లెలు అన్న విషయం కూడా తెలిసిందే. ఇక నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి కలసి మలుపు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలో వీళ్లిద్దరు మనసులో ఒకటి అయ్యాయని, అప్పటి నుంచి ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జంట పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట.
వీరిద్దరి పెళ్ళికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానుందట. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆది పినిశెట్టి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందస్తుగానే ఆది పినిశెట్టికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ విషయంపై ఆది పినిశెట్టి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇకపోతే ఆది పినిశెట్టి ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నటిస్తున్న బుఆఫో 19 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…