Gayathri Dolly: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మరణించారు. కొందరు రోడ్డు ప్రమాదాల వల్ల, మరి కొందరు అనారోగ్యం కారణంగా ఇలా ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. గాయత్రి డాలి గా పేరు తెచ్చుకున్న అప్ కమింగ్ హీరోయిన్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించింది.
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రితో పాటు రోహిత్ కూడా గాయపడ్డారు. ఇక వెంటనే వారిని హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి, రోహిత్ ఇద్దరూ మరణించారు. అప్ కమింగ్ హీరోయిన్ అయిన నటి గాయత్రి డాలీ ని డి క్రూజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
అంతేకాకుండా గాయత్రి 2021లో LoL సలాం అనే ఒక మినీ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నటిగా మారాలి అన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి భవిష్యత్తును ఊహించుకున్న గాయత్రి మరణ ఈ వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అదేవిధంగా ఆమె అభిమానులు సినీ ఇండస్ట్రీ వారు ఆమె మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కెరీర్ పరంగా మంచి భవిష్యత్తును ఊహించుకున్న గాయత్రీ మరణం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…