Movie News

Aadi Sai Kumar: ఎయిర్‌పోర్టులో పెళ్ళి చూపులు…. హనీమూన్ లో గొడవ… షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆది సాయికుమార్!

Aadi Sai Kumar: ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ ప్రేమ కావాలి ‘ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఆది సరైన హిట్స్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ హిట్ ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా అది మొదటిసారిగా తన భార్యతో కలిసి టీవీ షోలో పాల్గొని సందడి చేశాడు. వెన్నెల కిషోర్ హోస్టుగా వ్యవహరిస్తున్న’ అలా మొదలైంది ‘ షోలో ఆది, అరుణ దంపతులు సందడి చేశారు. ఈ షోలో ఆది, అరుణ తమ వివాహ బంధం గురించి పంచుకున్న సరదా ముచ్చట్లు పంచుకుంటూ సందడి చేశారు. ఆది, అరుణని పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ షోలో అరుణ తన పెళ్లి చూపుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ క్రమంలో ఆది మాట్లాడుతూ…” మా పెళ్లి చూపులు ఎయిర్ పోర్ట్ లో జరిగాయి. మామయ్యగారు (సాయికుమార్‌) ఏదో ఊరు వెళ్లాలని ఎయిర్పోర్టుకి వెళ్లిన సమయంలో మా పేరంట్స్‌ కూడా అదే టైంకి హైదరాబాద్‌ వచ్చారు. అప్పుడు నాకు ఫోన్‌ చేసి ఎయిర్‌పోర్టుకు రా అని పిలిచారు. నేను వెళ్లేసరికి వాళ్లంతా నా కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడే మా పెళ్లిచూపులు జరిగాయి అంటూ అరుణ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఆది నా ఫోన్‌ నంబర్‌ అడిగితే మా నాన్నను అడిగి ఇచ్చాను అని తెలిపింది.

Aadi Sai Kumar:హనీమూన్ లో మొదటి గొడవ…

ఆది అందుకొని.. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నువ్వు మీ నాన్నను అడిగి నాకు నంబర్ ఇచ్చావా అనగానే అరుణా నవ్వేసింది. పెళ్ళి చూపులు అయ్యాక ఇద్దరం పక్కకు వెళ్ళి దాదాపు గంట సేపు మాట్లాడుతున్నాం. మధ్యలో మా పేరెంట్స్ వచ్చి డిస్టర్బ్ చేశారు. లేకపోతే ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుకునేవాళ్ళం అంటూ ఆది చెప్పుకొచ్చాడు.
ఇక ఇద్దరు మొదట ఎప్పుడు గొడవపడ్డారు అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా… హనీమూన్ లో మొదటిసారి ఇద్దరం గొడవపడ్డాము అని ఆది తెలిపాడు. ఇలా సరదా సంభాషణతో షో మొత్తం ఎంతో సందడిగా సాగిపోయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago