Gopichand: మ్యాచ్ హీరో గోపీచంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ‘ రామబాణం ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాగా రామబాణం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ సినిమా ప్రమోషన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్ పనులలో సినిమా యూనిట్ బిజీగా ఉంటుంది.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా శ్రీవాస్, గోపీచంద్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు. రామబాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గోపీచంద్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో దర్శకుడు శ్రీవాస్ తో గొడవ గురించి గోపీచంద్ వద్ద ప్రస్తావించారు.
గోపీచంద్ ఈ విషయం పై స్పందిస్తూ..”మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సినిమా షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్ల నిడివి ఎక్కువగా ఉంది. అప్పుడు శ్రీవాస్‌ను పిలిచి.. ”ఒకవేళ షూట్ చేసినా ఎడిటింగ్‌లో తీసేసే అవకాశం ఉంది” అని చెప్పాను. దానికి ఆయన.. ”అలా కాదు షూటింగ్ చేద్దాం. ఒకవేళ అప్పటికప్పుడు కావాలంటే మళ్లీ ఫుటేజీ రాదు కదా” అని బదులిచ్చాడు.
నేను ఎంత చెప్పినా వినలేదు. దాంతో నేను పట్టించుకోలేదు. తీరా చూస్తే ఎడిటింగ్ టేబుల్‌పైకి వెళ్లాక మొత్తం ఆ సన్నివేశాలను ఎడిటర్ కట్ చేసేశారు. ఇదే మా మధ్య జరిగింది. దీన్నే అందరూ గొడవలు అయ్యాయని రాసేశారు” అంటూ గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. గోపిచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన రామబాణం మే 5 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…