Movie News

NTR: ఎన్టీఆర్ కి అందని పిలుపు..కావాలనే తొక్కేస్తున్నారంటు అభిమానులు ఆందోళన..?

NTR: నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటన విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కేవలం మన భారతీయ సినీ దర్శకులు మాత్రమే కాకుండా హాలీవుడ్ దర్శకుడు కూడా ఎన్టీఆర్ నటన మీద ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఆశపడుతున్నట్లు కూడా వెల్లడించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో తాత వారసత్వాన్ని నిలబెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని కావాలని తొక్కేస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నందమూరి కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. నందమూరి కుటుంబంలో ఎన్ని గొడవలు అయినా ఉండవచ్చని.. అయితే ఆ గొడవల వల్ల ఎన్టీఆర్ ను అవమానించడం సరికాదని ఫాన్స్ మండిపడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ ను ఆహ్వానించకపోవడం చాలా అన్యాయం అని. అలా చేయడం ముమ్మాటికీ తప్పేనని నందమూరి కుటుంబ సభ్యుల మీద తారక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

NTR: నందమూరి వారసత్వాన్ని నిలబెడుతున్న తారక్….

నందమూరి కుటుంబం నుండి బాలయ్య తప్ప మిగిలిన హీరోలు ఎవరూ కూడా తన తాత వారసత్వాన్ని నిలబెట్ట లేకపోతున్నారని కానీ తారక్ మాత్రం ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా నందమూరి కుటుంబం కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నాడు. అలాంటి తారక్ ను తొక్కేయడానికి ప్రయత్నించవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.ఈ పరిస్థితి రిపీట్ కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago