Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోల నుండి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ సమంత కలిసి పని చేసింది. ఇప్పటికీ అందరితోనూ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటుంది. అయితే సమంతకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు మాత్రం వీళ్లెవ్వరూ ముందుకు రావడం లేదు. .టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా సమంతకి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే హీరోలు మాత్రం ఎవ్వరు స్పందించడం లేదు.
మన టాలీవుడ్ హీరోలు సమంతని దూరం పెడుతున్నారా? అందుకే ఆమెకి బర్త్డే విషెస్ చెబుతూ పోస్టులు చేయటం లేదా అని అందరిలో అనుమానం కలుగుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా కాకుండా సమంతకి పర్సనల్ గా ఫోన్ చేసి విషెస్ చెప్పి ఉండవచ్చు కదా అని కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
సమంత బర్త్ డే స్పెషల్‌గా ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ మైత్రీ సంస్థ ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ ఆమెకి స్పెషల్ విషెస్ తెలియజేయగా దర్శకుడు శివ నిర్వాణ కూడా సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా సమంతకి బర్తడే విషెస్ తెలియజేశాడు. అయితే ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి మన హీరోలు సమంతకు విషెస్ చెబుతారా? లేదా? అన్నది చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…