Shruthi Hassan: కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ ఈ ఏడాది రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శృతిహాసన్ ఎలాంటి సినిమాలను ప్రకటించలేదని భావించారు. అయితే ఈమె నాని హీరోగా నటిస్తున్న తన 30 వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా శృతిహాసన్ పాల్గొన్నారు.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శృతిహాసన్ నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో శృతిహాసన్ నానికి జోడిగా నటిస్తున్నారా.. లేక ఏదైనా కీలకపాత్రలో నటిస్తున్నారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం శృతిహాసన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
నాని నటించిన దసరా సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో నానికి ఒక కూతురు కూడా ఉండబోతుందని ఈ సినిమా తండ్రి కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…