Categories: FeaturedMovie News

Senior Artist Pragathi : నా భర్తకు నాకు మధ్య విబేధాలకు కారణం… మా అమ్మ నన్ను దూరం పెట్టింది… ఆస్తులు ఇవ్వలేదు… బాధ్యతలు ఇచ్చారు…: సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి

Senior Artist Pragathi : తెలుగులో అమ్మ పాత్రలలో ఎక్కువగా మెరిసి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నటి ప్రగతి అందరికీ తెలుసు. ఇదంతా కరోనా ముందు అనాలేమో ఇప్పుడు మాత్రం అమ్మ పాత్రలతో కాదు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్. కూతురూతో కలిసి డాన్సులు, ఇక తన వర్క్ అవుట్ వీడియోలతో తాను ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా దూసుకెళతోంది. ఇక ప్రగతి ఆంటీకి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి మొదట హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా ఒక ఏడో ఎనిమిదో సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడారు.

భర్తతో విబేధాలు… అమ్మ దూరం పెట్టింది…

ప్రగతి చెన్నై లో చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులేసారు. తాను చదువుకుంటున్న సమయంలోనే ఖర్చులకు డబ్బు తల్లికి ఆసరాగా ఉండవచ్చు అనే ఉద్దేశంతో మోడలింగ్ వైపు వెళ్లినట్లు చెప్పిన ప్రగతి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సినిమాల్లో నటించే సమయంలోనే 20 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తల్లి దూరం పెట్టిందని ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక పెళ్లి సమయంలో తన భర్తకు 23 ఏళ్ల వయసు, ఇద్దరికీ పెద్దగా మెచ్యురిటీ లేకపోవడం వల్ల విడిపోయామని తెలిపారు ప్రగతి.

ఇక విడిపోయే సమయానికి తనకు ఒక కొడుకు ఉండటం, వాడిని చూసుకోవడం నా బాధ్యత అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయాలని వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లానని ప్రగతి తెలిపారు. తల్లి వైపు నుండి కానీ, భర్త వైవు నుండి కానీ ఎటువంటి ఆస్తి రాలేదని ఇక ఆశించలేదు కూడా అంటూ తెలిపారు ప్రగతి. కానీ మొదటి నుండి బాధ్యతలు మాత్రం నేనే తీసుకున్నానని కష్టపడి ఈ స్టేజి కి వచ్చానంటూ తెలిపారు ప్రగతి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago