Featured

‘డాన్స్ నా DNAలోనే ఉంది.. గ్యాప్ ఇవ్వలా వచ్చింది..’ ఆట గీతిక ఎలా ఉందొ తెలుసా ?

యాంకర్ ఓంకార్ ‘ఆట’ డాన్స్ షోలో బేబీ గీతిక గుర్తుంది కదా.. అతి చిన్న వయసులో తన డ్యాన్స్‌తో ఆట షోలో అందరి మనసులు దోచుకుంది గీతిక. ఆ డ్యాన్స్‌ షో టైటిల్‌ గెలిచిన తరువాత గీతికా పేరు మారుమ్రోగిపోయింది. అయితే ఆ తర్వాత ఎక్కడా కూడా గీతిక తెరపై కనిపించలేదు. దీంతో గీతిక జీవితం దయనీయ స్థితిలో ఉందో చూడండి అంటూ అనేక వార్తలు నేట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది గీతిక.

అయితే ఆ సమయంలో ఒక ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా తనకు యాక్సిడెంట్ అయ్యిందని, ఆ ప్రమాదంలో తన ఎడమకాలు, చేయి విరిగిపోయాయని చెప్పింది. అదే యాక్సిడెంట్ లో తన తండ్రికి కూడా చాలా గాయపడ్డాడని, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. అయితే ఆ ప్రమాదం నుంచి కోలుకున్నాక ఒక సినిమాతో పాటు కొన్ని సీరియల్స్ లో నటించాని కానీ పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పింది. ఇక అటువంటి సమయంలో తన తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లాల్సి వచ్చిదనీ ఇక అప్పుడు తాను అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగానని, అప్పుడు షూటింగ్‌లకు రావడం వాళ్లకు కాస్త కష్టం అయ్యేదని, అందువల్ల షూటింగ్ లకు బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

‘ కానీ.. ఆ సమయంలో నాపై అనేక రకాల వీడియోలు వచ్చాయి. ‘గీతిక షూటింగ్ కి వెళ్తే అక్కడ అడుగు కూడా పెట్టనివ్వలేదు‘, ‘ఆట గీతిక పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు’ అంటూ అనేక వీడియోలు యుట్యూబ్ లో దర్శనమిచ్చాయి. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు.. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదవుతున్నానని, డ్యాన్స్‌ని ఎప్పటికీ మర్చిపోను. తన డీఎన్‌ఏలోనే డాన్స్ ఉందని, వచ్చే సంవత్సరం కెరీర్‌ ఆలోచిస్తానని తెలిపింది. అయితే మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

39 minutes ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

59 minutes ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

1 hour ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

17 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

17 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

17 hours ago