తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్ట బోతున్న విషయం తెలిసిందే.. దీని సంబంధిచిన పనులో నిమగ్నమయ్యారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల. తన కొత్త పార్టీ కోసం పలు జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలతో ఆమె బుధవారం లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనకు పునరుజ్జీవం పోసేందుకు నేను సిద్దంగా ఉన్నానని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల ఆశయాలే మా పార్టీ సిద్ధాంతాలు.. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన అనగా జూలై 8న తన పార్టీని ఆవిష్కరించానున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. అదేరోజున పార్టీ పెరుతో పాటూ జెండా, ఎజెండా ను ప్రకటించనున్నారు.
‘తెలంగాణలో ప్రజల బాగు కోసం నూతనంగా స్థాపించబోయే మన పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా రూపకల్పన చేయబోతున్నాం. దీని కోసం ప్రజలంతా reach@realyssharmila.com అనే ఈమెయిల్ ఐడీకి గానీ, 8374167039 నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ తమ సూచనలు పంపాలని కోరుతున్నాం’ అని ఆమె చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…