అక్కినేని నాగచైతన్య.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటాడు ఈ అక్కినేని హీరో. యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ఈ యువసామ్రాట్ కు కార్లు, స్పోర్ట్స్ బైకులంటే విపరీతమైన ఇష్టం. ఫెరారీ నుండి మెర్సిడెస్ వరకు ఈ అక్కినేని హీరో ఇంటి గ్యారేజీలో భారీ కలేక్షనే దాగుంది. మార్కెట్లోకి కొత్తగా ఏ స్పోర్ట్స్ బైకు వచ్చినా అతని మనసు దోచిందంటే చాలు ఆ వెంటనే దాన్ని తన గెరేజ్ లో ప్రత్యక్షమవ్వాల్సిందే. ఈ నేపద్యంలో అక్కినేని నాగ చైతన్య దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ భారీగానే ఉంది. మరి ఇంకేంటి ఆలస్యం చైతూ దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో? వాటి ఖరీదెంతో చూసేద్దాం..
BMWR9T: చైతూ దగ్గరున్న అత్యంత ఖరీదైన బైకుల్లో BMWR9T ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైక్‌ను చైతన్య సుమారు రూ.19 లక్షలు ఖర్చు చేసి మరీ తన సొంతం చేసుకున్నాడు. దీనిపై సమంతతో మరీ రోడ్ల మీద పలు మార్లు చక్కర్లు కొడుతూ మీడియా కంటపడ్డాడు కూడా.
Triumph Thruxton R bike: చైతన్య రేస్ బైక్‌లను ఎంతగా ఇష్టపడతాడో అతని ఖరీదైన బైకుల చుస్తే ఇట్టే అర్ధమయిపోతుంది. సుమారు 13 లక్షల విలువైన ఈ రేసర్ బైక్ Triumph Thruxton R Bike అతని సొంతం.
Ferrari F 430: అసలు మార్కెట్ లో ఈ కారుకు క్రేజే వేరు. జాన్‌సేన నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు Ferrari F 430 రెడ్ బ్యూటీ కారుకు భారీ ఫాలోయింగే ఉంది.. ఈ కారు ధర రూ.1.75 కోట్లు.. చైతూ దగ్గర ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ లో ఇది కూడా ఒకటి.
Mercedes Benz G-Class G63: నాగ చైతన్య వద్ద ఉన్న ఈ మెర్సిడిస్ బెంజ్ కారు ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట. చై తో పాటూ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌లతో పాటు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద కూడా ఈ కారును సొంతం చేసుకున్నవాల్లలో ఉన్నారు.
MV Agusta F4: నాగ చైతన్య వద్దనున్న లగ్జరీ బైకులలో ఆయన ఫేవరెట్ MV Agusta F4. ఈ బైకు ధర సుమారు రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉంటుంది. ఈ బైకు పై చై షికార్లు చేస్తూ చాలా సార్లు మీడియా కంట పడ్డాడు.
అయితే వీటితో పాటు యమహా YZFR1 స్పోర్ట్స్ బైక్ మరియు హోండా స్పోర్ట్స్ బైక్ తో సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…