Aata Sandeep wife Jyothiraj : ఓంకార్ తెలుగు రియాలిటీ షోలలో సంచలనం. ఆట, మాయ ద్వీపం వంటి షోలతో బాగా పాపులర్ అయిన ఓంకార్ ఆ తరువాత సినిమాలను కూడా తీస్తున్నారు. ఇప్పటికీ సిక్స్త్ సెన్స్, ఇంకా షోలు కూడా చేస్తున్న ఓంకార్ గురించి ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పరోక్షంగా ఓంకార్ మీద వాఖ్యలు చేసారు.
నీ పెద్ద సినిమాల్లో అవకాశలు ఇవ్వొచ్చు కదా…
ఆట డాన్స్ షో ద్వారా చాలా మంది కొరియోగ్రాఫర్లుగా సినిమా ఇండస్ట్రీ కి వచ్చారు. మొదట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీళ్లంతా ఇపుడు అవకాశాలు లేక ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక ఆ విషయాన్నే ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు జ్యోతి రాజ్. యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్స్ వీడియోలు పెడుతూ మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆట సందీప్, జ్యోతి రాజ్ లను పక్కన పెడితే మిగిలిన ఆట కంటెస్టెంట్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్స్ మాస్టర్లు ఎవరూ కనిపించడం లేదు.
మీరు చెక్కిన డైమండ్లకు మీరే అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటూ పరోక్షంగా ఓంకార్ ను ఉద్దేశించి మాట్లాడారు జ్యోతిరాజ్. ఓంకార్ చేస్తున్న పెద్ద సినిమాల్లోనూ, పెద్ద ఈవెంట్లలోనూ వేళ్ళకు అవకాశం ఇస్తే కెరీర్ బాగుంటుంది కదా మరి ఎందుకు పట్టించుకోరు. మీరు కూడా పెద్ద కొరియోగ్రాఫర్ల వెంట పడుతున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…