Singer Kalpana : తమిళంలో గాయని గా మొదట కెరీర్ ని ప్రారంభించిన కల్పన తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం కన్నడ భాషలలో ఇప్పటివరకూ 3000 లకు పైగా పాటలు పాడింది. ఎటువంటి కష్టమైన పాటనైనా అలవోకగా పాడేస్తారు. ఐదేళ్ళకే పాటలు పాడటం ప్రారంభించిన కల్పన బాల నటిగా కూడా చేశారు. బాల నటిగా సుమారు 30 సినిమాలలో నటించారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలోని ‘రాళ్ళల్లో ఇసకల్లో’ పాటలో బాల నటిగా కల్పన కనిపిస్తారు. మధురమైన పాటలతో అభిమానులను సంపాదించుకున్న కల్పన తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో చిత్రమ్మ నాకు దైర్యం చెప్పింది…
ప్రముఖ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసిన కల్పన పాతికేళ్లుగా పాటలు పాడుతూ అలరిస్తోంది. కెరీర్ లో ఎంత సక్సెస్ అయినప్పటికీ జీవితం లో చాలా ఎదుర్కొన్నాను అని తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పన అలా చెప్పుకొచ్చారు… నా వివాహ బంధం అనేక వేధింపులతో 2010 లో ముగిసిపోయింది, అప్పటికి నాకు ఒక పాప, అంత ముగిసిపోయింది. ఉన్నది మొత్తం కోల్పోయాను చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అపుడు చనిపోవడానికి పుట్టావా అని చిత్రమ్మ చాలా దైర్యం చెప్పింది అని కల్పన చెప్పుకోచ్చారు.
అసమయంలో మలయాలంలో ఒక ప్రోగ్రాం జరుగుతోంది, నువ్వు పాల్గొంటావా అని చిత్రమ్మ అడగడం, నేను పాల్గొనడం అందులో గెలిచి డబ్బులు కూడా రావడం తో చాలా సంతోషించాను. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 3 వేల స్టేజ్ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేశారు కల్పన. అందులోను మన దేశంలో కన్నా ఇతర దేశాలలో ఎక్కువగా షోలు ఇచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో ప్రసారమైన మొదటి బిగ్ బాస్ సీజన్ లో కల్పన పాల్గొనడం జరిగింది అయితే నాలుగు వారాలకే కల్పన ఎలిమినేట్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…