Vishal : పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విశాల్ తమిళ హీరో అయినా నిజానికి తెలుగు కుర్రాడు. ప్రేమ చదరంగం సినిమాతో పరిచయమైన విశాల్ ఆ తరువాత పందెం కోడి, భరణి, వాడు వీడు, రాయుడు, డిటెక్టివ్, ఎనిమి వంటి సినిమాలతో అలరించిన విశాల్ తాజాగా ‘లాఠీ’ సినిమా తీశారు. ఈ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాల్లో గాయపడటం కూడా జరిగింది. ఇక లాఠీ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా నిర్వహించిన ఈవెంట్ లో స్టేజ్ మీదనే సహా నటుడిని కొట్టి వైరల్ అయ్యాడు విశాల్.
చేతిలోని మైక్ లాక్కున్న విశాల్…
విశాల్ కి అత్యంత సన్నిహితుడైన రోబో శంకర్ విశాల్ గురించి వేదిక మీద మాట్లాడుతూ ఉండగా మధ్యలో విశాల్ అందరినీ పట్టించుకుంటాడు, అందరికీ ఫోన్ చేసి బాగోగులు కనుక్కుంటాడు. కానీ ఎందుకో తెలియదు నన్ను మాత్రం ఎదో నామ మాత్రంగా పిలుస్తాడు పట్టించుకోడు అంటూ ఇంకా ఎదో చెప్పబోయే క్రమంలో విశాల్ హఠాత్తుగా శంకర్ చేతిలోని మైక్ లాక్కున్నాడు అలాగే కొట్టాడు.
మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే కొట్టడానికి వెళ్లబోతుంటే అక్కడే స్టేజ్ మీద ఉన్న మరో నటుడు సూరి అదంతా చూసి స్టేజ్ దిగి వెల్లిబోతుంటే విశాల్ వెనక్కు పిలిచి అదంతా ప్రాంక్ అంటూ నవ్వేశారు శంకర్, విశాల్. ఇక అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సూరి, రోబో శంకర్, విశాల్ కు ఇలా షూటింగ్ సమయాల్లో కూడా ప్రాంక్ చేయడం అలవాటు. అలా ప్రాంక్ చేసి సినిమా ప్రమోషన్స్ ను వైరల్ చేశాడు విశాల్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…