Categories: FeaturedMovie News

jabardasth Phani : మల్లెమాలలో జరిగేది అదే… కిర్రాక్ ఆర్పి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలియదు.. సుదీర్ గురించి ఏడుకొండలు చెప్పినవన్నీ అబద్దాలే.. : జబర్దస్త్ ఫణి

Jabardasth Phani : జబర్దస్త్ లో బానిస బతుకు బతకలేక, వాళ్ళు వేసే మెతుకులు తినలేక బయటికి వచ్చేసానని యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర విమర్శలు బాగా వైరల్ అయ్యాయి. జబర్దస్త్ ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడం కాదు మేమే జబర్దస్త్ కు జీవితాన్ని ఇచ్చాము అంటూ కామెంట్స్ చేసాడు ఆర్పి అక్కడ ఎవరిని మనుషుల్లా చూడరు అంటూ మల్లెమాల సంస్థను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఇక వీటిపై జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అలాగే జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన కమెడియన్స్ పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ జబర్దస్త్ లో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నారు.

మల్లెమాల సంస్థలో అదే జరిగేది….

జబర్దస్త్ మానేసి ఐదేళ్ళు దాటి పోయింది మేము ఉన్న రోజుల్లో జబర్దస్త్ లో తిండి గురించి ఏ రోజు అనుకోలేదు స్కిట్లు ఎలా చేయాలి ఇంకా ఎంత బాగా చేయాలి అన్నదాని మీదే మా ఫోకస్ ఉండేది అంటూ ఫణి చెప్పాడు. పేమెంట్ టైం కి ఇచ్చేవాళ్ళని తనకు అదిరే అభి టీం లో పని చెసేప్పుడు స్కిట్స్ కి ఇరవై ఐదు వేలు ఇచ్చేవాడని కామెడీ స్కిట్స్ కి లక్షల్లో సంపాదన జబర్దస్త్ వల్లే వచ్చింది అంటూ చెప్పాడు. కిర్రాక్ ఆర్పి నాకు తమ్ముడు కానీ తనకు అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావడం లేదని, నాగబాబు గారు చాలా మంచివారని చెప్పాడు. తన కూతురు చదువుకు నాగబాబు సహాయం చేసారని జబర్దస్త్ లో వాళ్ళను బయటకు తీసి సొంత కామెడీ షో చేయాల్సిన అవసరం నాగబాబు గారికి లేదని వివరించాడు. ఆయన అనుకుంటే చిరు తోనో లేక పవన్ తోనే సినిమా చేయొచ్చు కదా ఇలాంటి చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటాడు అంటూ అభిప్రాయ పడ్డాడు.

సుధీర్, రామ్ ప్రసాద్, శీను ముగ్గురి స్నేహం చాలా బాగుంటుందని ఇప్పటికి వాళ్ళు అలానే ఉన్నారు, మేనేజర్ ఏడు కొండలు జబర్దస్త్ లో ఉన్నపుడు అన్ని తానే చూసుకునే వాడు ఇప్పుడు జబర్దస్త్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు అంటూ చెప్పారు. సుదీర్ గురించి ఏడుకొండలు చెప్పినవన్నీ అబద్దాలే.. తన మంచితనం టాలెంట్ వల్లే సుధీర్ కి అంత మంది అభిమానులు ఉన్నారంటూ చెప్పాడు. మొత్తానికి కిర్రాక్ ఆర్పి చేసిన విమర్శలను నిజం కాదు అంటూ చెప్పకనే చెప్పాడు జబర్దస్త్ ఫణి. మళ్ళీ జబర్దస్త్ లో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago