Actress Kalyani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా అందరికీ సుపరిచితమైన నటి కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈమె నటుడు దర్శకుడు సూర్యకిరణ్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 200 పైగా సినిమాలలో నటించారు. అలాగే ఈయన సొంతం సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన అనంతరం ఈయన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అవకాశాలు లేకుండా పోయాయి.
ఇకపోతే 10 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న కళ్యాణి దంపతులు విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి విడాకులకు కారణాలు ఏమిటి అనే విషయం మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య కిరణ్ విడాకులకు కారణాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో విడాకులు గల కారణాలు ఏమిటి తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ మేము విడాకులకు మంజూరు చేసినప్పుడు జడ్జి గారు మమ్మల్ని విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి అని ప్రశ్నించారు.
ఆ సమయంలో నాకైతే ఎలాంటి కారణాలు లేవు మీరు చెప్పండి అని కళ్యాణి గారిని అడిగాను. జడ్జిగారు కళ్యాణిని ప్రశ్నిస్తూ మీ ఆయన సరిగా చూసుకోవడం లేదా? నిన్ను హింసిస్తున్నారా అంటూ ఎన్నో ప్రశ్నలు అడిగారు అయితే వీటన్నిటికీ ఈమె లేదు అనే సమాధానం చెప్పింది.మరి మీరు విడిపోతే పిల్లలు ఎక్కడ ఉంటారు అని జడ్జిగారు ప్రశ్నించారు. మాకు పిల్లలు లేరు సార్ అని చెప్పాము. అయితే మీరు విడిపోవడానికి పిల్లలే కారణమా అంటూ మావిడాకులకు కారణాన్ని జడ్జి గారే చెప్పారు.ఇక బయటకు వచ్చిన తర్వాత సూర్యకిరణ్ కళ్యాణి తో మాట్లాడుతూ కొద్ది రోజులు ఆగండి డబ్బులు వచ్చాక అప్పులన్నీ కట్టేద్దాం తిరిగి మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామని తెలిపినట్లు సూర్య కిరణ్ ఈ సందర్భంగా తెలిపారు.ఇకపోతే వీరు విడాకులకు కారణం కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమేనని అయితే వీరిద్దరూ తిరిగి పెళ్లి చేసుకొని ఒకటవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…