Mani Rathnam : కరోనా మరోసారి దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తాజాగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ నాట సినీ తారలు, రాజకీయ నాయకులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే హీరో శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇపుడు తాజాగా స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చేరిన మని రత్నం…
కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన దర్శకుడు మణిరత్నం ను చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే ఈయన ఆరోగ్యానికి సంబదించిన విషయాలు ఇంకా తెలియాల్సి వుంది. మణిరత్నం గారి భార్య అయిన సుహాసిని ఆయన ఆరోగ్యానికి సంబందిన సమాచారం త్వరలోనే వెళ్ళడించే అవకాశం వుంది. ప్రస్తుతం మణిరత్నం విక్రమ్ హీరోగా పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి, శోబితా దూళిపాళ్ళ, ప్రభు.. మొదలైన వారు నటిస్తున్నారు. రెండు బాగాలుగా రాబోతున్న ఈ సినిమా లో మొదటి భాగం సెప్టెంబర్ 30న రాబోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ మని రత్నంకు కరోనా సోకడంతో సెట్స్ లోని మిగతా వారిలో కలకలం మొదలైంది. మణిరత్నం గారితో కాంటాక్ట్ అయిన వారందరిని సెల్ఫ్ ఐసొలేషన్ కి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో హీరోగా చేస్తున్న విక్రమ్ కూడా చెస్ట్ పెయిన్ తో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం లేనట్టే అని అంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…