Categories: FeaturedMovie News

Inaya sulthana : ఆర్జీవి తో డాన్స్ వీడియో వల్ల నా కుటుంబం నన్ను ద్వేషిస్తోంది.. సినిమాల కోసం ఇంట్లో నుండి వచ్చేసా : ఇనయ సుల్తానా

Inaya Sulthana : వర్ధమాన నటి ఇనయ సుల్తానా వివాదాల జీవి ఆర్జీవి తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. నెటిజన్స్ నుండి ట్రోల్స్ కూడా వెల్లువెత్తాయి. ఇక రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ నేను కాదు ఆ వీడియో లో ఉన్నది, అంటూ తనదైన శైలి లో స్పందించాడు. ఈ వీడియో వల్ల సుల్తానా ఇంట్లో తనను ఎలా చూస్తున్నారు తన జీవితం ఎలా మారిపోయింది అన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఇనయ సుల్తానా చెప్పింది.

మా అమ్మ ఏడ్చింది…

సినిమాల్లోకి రావాలని ఉన్నా ఇంట్లో వాళ్ళ సహకారం లేక ఇంట్లో నుండి వచ్చేసి హైదరాబాద్ లో సినిమా ప్రయత్నాలు చేసిందట ఇనయ. తన తండ్రి కరోనా సమయంలో మరణించడం తో కుటుంబం ఆర్ధిక కష్టాలకు లోనైందని, అయితే తాను సినిమాల్లోకి వెళ్లడం పక్కన పెడితే అసలు జాబ్ చేయడం కూడా తన కుటుంబానికి ఇష్టం లేదని చెప్పింది. ఇక ఒంటరిగానే హైదరాబాద్ లో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇనయ సుల్తానా కి రామ్ గోపాల్ వర్మ తో కలిసి పనిచేసే అవకాశం రావడం, పరిచయం ఏర్పడటం తో తన పుట్టినరోజున పార్టీ కి పిలిచినపుడు డాన్స్ చేశామని, ఆ వీడియో నా బర్త్ డే పార్టీ అయిన నాలుగు రోజులకు బాగా వైరల్ అయింది. ఇక ఆ వీడియో తరువాత అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చింది, వంశం పరువు మొత్తం తీస్తున్నావ్ అంటూ ఇంటి సభ్యులు తిట్టడం, బాగా బాధేసింది అంటూ ఎమోషనల్ అయింది ఇనయ సుల్తానా. నా గురించి మాట్లాడటం కూడా మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళ గురించి నేను కూడా ఎక్కడా చెప్పాలనుకోవడం లేదు.

ఒంటరి మహిళ గానే ఉంటూ సినిమా ఫీల్డ్ లో మంచి పాత్రలు చేయాలని ఉంది అంటూ ఇనయ చెప్పింది. ఇంట్లో నుండి వచ్చేసిన తరువాత చాలా సార్లు ఇంటికి ఫోన్ చేసినా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కుటుంబం పరువు తీసావ్ అంటూ తిట్టారు గానీ నా గురించి నాకున్న బాధలను వినలేదు. సోషల్ మీడియా లో నా ఫోటోలను చూసి నేను హ్యాపీగా ఉన్నానని అనుకుంటారు కానీ సినిమాల్లో అవకాశలు కోసం సోషల్ మీడియా లో ఉండాల్సిందే. ఇక ఆ ఫోటో వెనుక నా బాధలేంటో నాకు తెలుసు అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం మంచి సినిమాల్లో నటిస్తున్నానని మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య వల్ల పెద్ద సినిమాలను వదులుకున్నానని చెప్పింది. తాజాగా వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తున్న ఈ ‘ఏవం జగత్’ బ్యూటీ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నానని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సినిమాల్లో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తానని చెబుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago