Abbas: అబ్బాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్రేమదేశం సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఉన్న ఫలంగా అబ్బాస్ ఇండస్ట్రీకి దూరమై విదేశాలలో స్థిరపడ్డారు.
విదేశాలలో స్థిరపడినటువంటి ఈయన అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇలా తమ జీవనం కొనసాగించడం కోసం బైక్ మెకానిక్ గాను పెట్రోల్ బంక్ లో పని చేశానని పలు సందర్భాలలో అబ్బాస్ తెలియజేశారు. అయితే తాజాగా ఇండియా వచ్చినటువంటి ఈయన తిరిగి సినిమాలలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో కొనసాగుతానని తెలిపారు.
ఇకపోతే ఈయన ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ హార్పిక్ యార్డ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి సమయంలో తనకు ఈ యాడ్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇలా ఈ యాడ్లో నటించి వచ్చిన డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకున్నానని ఈయన తెలిపారు. కానీ ఈ యాడ్ చేసినందుకు నాపై చాలా విమర్శలు వచ్చాయని అబ్బాస్ వెల్లడించారు.
నేను హార్పిక్ అదొక టాయిలెట్ క్లీనర్ గా మాత్రమే అందరికీ చెప్పాను దానిని ఎవరు తాగమని చెప్పలేదు అంతేకాకుండా ఈ యాడ్ ద్వారా పరిశుభ్రతను పాటించాలి అన్న ఒక సందేశాన్ని అందరికీ తెలియజేశాను. కానీ నా పట్ల చాలామంది విమర్శలు చేస్తూ ట్రోల్ చేశారు. అయినప్పటికీ తానేమి బాధపడలేదని తెలిపారు. కానీ ఈ కంపెనీ వారు ఇచ్చినటువంటి డబ్బుతోనే నా ఫ్యామిలీని పోషించుకున్నానని ఈయన ఈ సందర్భంగా అబ్బాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…