Vasundhara: నందమూరి నటసింహ బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య భార్యగా ఈమె ఎంతో మందికి సుపరిచితమయ్యారు. ఇక బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ ఈమె మాత్రం బయట ఇక్కడ పెద్దగా సందడి చేయరు కేవలం ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ బాలయ్య విజయానికి దోహదపడ్డారు.
ఇలా కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఓ బాధ్యత గల ఇల్లాలిగాను తల్లిగాను వసుంధర పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వసుంధర దేవి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటూ వైరల్ అవుతుంది.
ఈమె చేతిగుండా ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని లేకపోతే ఏదైనా సహాయం తీసుకున్న వారు అందులో మంచి సక్సెస్ సాధిస్తారని తెలుస్తోంది అందుకే ఈమెను గోల్డెన్ హ్యాండ్ అంటూ అందరూ పొగుడుతూ ఉంటారు ఇక బాలకృష్ణతో సినిమాలు చేసే నిర్మాతలు కూడా ముందుగా ఈమె చేతి నుంచి లక్ష రూపాయలు తీసుకుని సినిమాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ఇక ఏ శుభకార్యం జరిగిన తన ఇంట్లో వాళ్ళు ముందుగా వసుంధర చేతనే ఆ కార్యాన్ని మొదలుపెట్టిస్తారట. ఇలా ఈమె చేతి గుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టిన కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని అందరూ భావించడం వల్ల ఏ కార్యం జరిగిన ముందుగా వసుంధర ఉండాలని భావిస్తారట ఇక సినిమాల పనుల నిమిత్తం లేదా ఇతర కార్యక్రమాల నిమిత్తం బాలకృష్ణ బయలుదేరి సమయానికి వసుంధర తప్పనిసరిగా ఎదురు వస్తుందని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…