Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ క్రైమ్ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి నవీన్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. తన స్నేహితుడు హరిహర తనని నమ్మించి దారుణంగా తనని హత్య చేయడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారింది. అయితే నిందితుడు హరిహర తల్లిదండ్రులు తాజాగా ఈ విషయంపై స్పందించారు.
హరిహరకృష్ణ కుటుంబ నేపథ్యానికి వస్తే.. వీరి స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్. తండ్రి పేరాల ప్రభాకర్.. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా.. తల్లి గృహిణి. ఇక ప్రభాకర్ స్థానికంగా క్లినిక్ నడుపుతున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా అమ్మాయికి పెళ్లి చేశారు ఇంకొక అబ్బాయి హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కొడుకు నైనా సక్రమంగా పెంచుకోవాలని గత 14 సంవత్సరాలుగా తనని హైదరాబాదులో ఉండి చదివిస్తున్నారు.
తన అక్క ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పగా స్నేహితులతో కలిసి ఒక రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నామని చెప్పారు. అయితే శివరాత్రి రోజు తన కుమారుడు వరంగల్ వచ్చారని అప్పుడు తనకు ఎన్నో ఫోన్ కాల్స్ రావడంతో చాలా ఆందోళనగా కనిపించారని తెలిపారు. ఏమైంది అని అడగ్గా ఏమీ లేదని చెప్పారు. అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికే నవీన్ మిస్సింగ్ అని తెలియడంతో కాస్త కంగారు పడ్డాము.
కుమారుడు ఈనెల 23వ తేదీ వరంగల్ వచ్చారని ఏమైందని నిలదీస్తే తాను నవీన్ ను హత్య చేసి చంపానని ఒప్పుకున్నట్లు తన తండ్రి తెలిపారు.చేసిన తప్పును తాము మందలించి పోలీసులకు లొంగిపోవాలని చెప్పడంతో తాను హైదరాబాద్ వచ్చి పోలీసులకు లొంగిపోయారని హరిహర తండ్రి ప్రభాకర్ తెలిపారు. అయితే నవీన్ ను తన కుమారుడు దారుణంగా చంపినందుకు ప్రభాకర్ నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేశారు.ఇలా పెద్ద కుమారుడు హత్య కేసులో నిందితుడిగా మారి అవమానంతో ఉరి వేసుకొని చనిపోగా రెండవ కుమారుడు కూడా ఇలా హత్య కేసులో నిందితుడుగా మారి జైలు పాలు కావడంతో హరిహర తల్లిదండ్రులు కన్నీటి పర్యంతరం అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…